సర్కారుపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Update: 2023-02-15 08:54 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. 15 ఏళ్లు గడిచిన ధరణి సమస్యలు ఎందుకు పరిష్కరించలేక పోతున్నారని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఎప్పుడొస్తాయో చెప్పగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కేటాయింపులు లేకున్నా బడ్జెట్ మాత్రం వినసొంపుగా ఉందన్నారు. కరెంటు కోతలపై నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మీ పార్టీ నేతలకు ప్రైవేటు యూనివర్సీటీలు కట్టబట్టలేదా అని కేసీఆర్‌పై పరోక్షంగా మాటల దాడికి దిగారు.  

Tags:    

Similar News