తెలంగాణ ప్రజలు.. ఈ కింది వస్తువులను స్టాక్ పెట్టుకొండి: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అలర్ట్ పంపారు.

Update: 2024-05-09 04:01 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అలర్ట్ పంపారు. రాష్ట్ర ప్రజలు వెంటనే.. ఇన్వర్టర్, ఛార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, కొవ్వొత్తులు, జనరేటర్లు, పవర్ బ్యాంకులు వంటివాటిని స్టాక్ తెచ్చుకుని పెట్టుకొవాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని.. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల తర్వాత వీటి అవసరం చాలా ఉంటుందనే కోణంలో మాజీ మంత్రి కేటీఆర్ పవర్ కట్స్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. అలాగే ఇవన్నీ గుర్తుంచుకుని ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓట్లు వేయాలని సూచించారు. కాగా 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం పవర్ కట్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Similar News