ఆ ఆయుధాలెక్కడివి..? అతిక్ అహ్మద్ హత్యపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-04-21 12:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అష్రఫ్ హత్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన.. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు ఎలా చంపబడ్డారని ప్రశ్నించారు. చంపిన వ్యక్తులు తీవ్రవాదులు, తీవ్రవాద ఆలోచన కలిగిన వారని.. వారు మరింత మందిని చంపే అవకాశం ఉందని ఆరోపించారు.

గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అష్రఫ్‌లను చంపిన వ్యక్తులపై ఉపా చట్టం ఎందుకు ప్రయోగించలేదని ప్రశ్నించారు. అసలు హంతకుల చేతికి ఆటోమేటిక్ ఆయుధాలు ఎవరిచ్చారు? వీరికి రూ.8 లక్షల విలువైన ఆయుధాలు ఎక్కడివన్నారు. హంతకులు తీవ్రవాదులు.. వారు గాడ్సే అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారని ఆరోపించారు. వీరిని అరికట్టకుంటే మరి కొంతమందిని చంపుతారని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News