పాతబస్తీ నైట్ బజార్లపై బండి వ్యాఖ్యలపై ఒవైసీ ఫైర్

పాతబస్తి నైట్ బజార్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు తగవని బండి సంజయ్ తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Update: 2023-04-04 11:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:పాతబస్తి నైట్ బజార్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు తగవని బండి సంజయ్ తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడాలని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పాతబస్తీలో ఓ వర్గం పండగల సమయంలో వ్యాపార సముదాయాలు అర్థరాత్రుల వరకు అనుమతి ఇస్తున్నారంటూ బండి సంజయ్ చేసి వ్యాఖ్యలపై ఒవైసీ మంగళవారం రియాక్ట్ అయ్యారు. రాజాసింగ్ బెయిల్ నిబంధనలను అతిక్రమించారని ఈ అంశంపై సీపీ స్పందించాలన్నారు. తెలంగాణలో వరుసగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం స్పందించిన ఒవైసీ ప్రశ్నపత్రాలు లీక్ కావడం దురదృష్టకరం అన్నారు. వీటికి బాధ్యులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టీఎస్ పీఎస్సీని రద్దు చేసి పరీక్షలను వెంటనే నిర్వహించాలన్నారు. షర్మిలతో ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News