శేరిలింగంపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు స్పాట్ డెడ్

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి రైల్ విహార్ కాలనీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2022-09-01 06:28 GMT

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి రైల్ విహార్ కాలనీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోగా, భవనం కుంచించుకుపోయింది. ప్రమాద ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మరణించినవారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read : గ్యాస్ వినియోగదారులకు శుభవార్త... 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News