BREAKING: అధికారికంగా టీఎస్ ఆర్టీసీ పేరు మార్పు.. కొత్త నేమ్ ఏంటంటే..?

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) పేరు అధికారికంగా మారింది. తెలంగాణ సంక్షిప్త పదం టీఎస్‌ అబ్రియేషన్‌ను (TS) టీజీగా (TG)

Update: 2024-05-22 10:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) పేరు అధికారికంగా మారింది. తెలంగాణ సంక్షిప్త పదం టీఎస్‌ (TS) అబ్రియేషన్‌ను టీజీగా (TG) మార్చాలని ఇటీవల ప్రభుత్వం అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విభాగాలను ఆదేశించిన విషయం తెలిసిందే. గవర్నమెంట్ ఆర్డర్స్ మేరకు ఇప్పటికే పలు శాఖలు పేరు మార్పు చేపట్టగా.. తాజాగా టీఎస్ ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా (TGS RTC) మార్చారు. దీంతో ఇక నుండి ఆర్టీసీ బస్సులపై టీఎస్ ఆర్టీసీ స్థానంలో టీజీఎస్ ఆర్టీసీ  దర్శనమివ్వనుంది. కాగా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ షార్ట్ కట్ నేమ్‌ను టీఎస్‌గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణ అబ్రియేషన్‌ను టీజీగా మార్చుతామని ప్రకటించింది. ఇప్పటివరకూ వాహనాల రిజిస్ట్రేషన్‌కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అధికారిక వ్యవహారాలకూ వర్తింపజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Similar News