'అమ్మకానికి టీవీ9' అసలేం జరిగుతుందో అధికారిక ప్రకటన

టీవీ9 విక్రయించబోతున్నారనే ప్రచారంపై ఆ సంస్థ రియాక్ట్ అయింది.

Update: 2024-05-23 11:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 24/7 న్యూస్ చానెల్ టీవీ9 తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. టీవీ 9 నెట్ వర్క్ యాజమాన్యపు హక్కులు త్వరలోనే చేతులు మారబోతున్నాయని ఈ సంస్థను ఇతరులకు అమ్మబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో, మీడియా సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాలు పూర్తవగానే ఈ ప్రక్రియ పూర్తి కాబోతున్నదని గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై టీవీ9 తెలుగు స్పందించింది. తమ అధికారిక ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలో వివరణ ఇచ్చింది. టీవీ9 నెట్ వర్క్ టేకోవర్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం అని ఖండించింది. దేశంలోని వార్తా ప్రసార మాధ్యమంలో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ జాతీయ స్థాయిలో అగ్రగామి వార్త సంస్థగా ఎదిగిన టీవీ9 నెట్ వర్క్ గురిచి జరుగుతున్న విషపు ప్రచారం పూర్తిగా సత్యదూరం అని, నిరాధారం అని స్పష్టం చేసింది. టీవీ9 ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద న్యూస్ నెట్ వర్క్ గా అవతరించి వార్తా ప్రపంచంలో ఎల్లలు దాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతోందని పేర్కొంది. అత్యుత్తమ వృత్తి నిపుణులతో కూడిన ఎడిటోరియల్ బృందాలతో టీవీ9 అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నదని, టెలివిజన్ న్యూస్ హిస్టరీలో సరికొత్త ఇండస్ట్రీ బెంచ్ మార్క్ ను సృష్టిస్తూ ఇండియా గ్రోత్ స్టోరీలో భాగంగా నిలిచిందని పేర్కొంది. రాబోయే రోజుల్లో గ్లోబల్ న్యూస్ ప్లేయర్ గా మందడుగు వేయడానికి సమాయత్తం అవుతోందని అలాంటి తమపై జరుగుతున్న అబద్దపు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రకటన విడుదల చేసింది. కాగా 2019లో ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి వరకు ఆ చానల్ కు సీఈవోగా ఉన్న రవి ప్రకాశ్ ను తప్పించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి యాజమాన్యం మారబోతున్నదన్న ప్రచారం నేపథ్యంలో సంస్థ పై విధంగా రియాక్ట్ అయింది.

Click Here For Twitter Post..

Tags:    

Similar News