27న విచారణకు హాజరు కావాల్సిందే.. నటి హేమకు నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Update: 2024-05-25 09:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీలో తన పేరు బయటపడిన నాటి నుంచి హేమ తాను రేవ్ పార్టీలో లేనని బుకాయిస్తూ వచ్చారు. కాగా, హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు సైతం బెంగళూరు పోలీసులు తేల్చారు. హేమతో పాటు 86 మంది డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు ఎదుట హాజరు కావాలని వారందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హేమను సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మిగిలిన వారికి వేర్వేరు డేట్స్ ఫిక్స్ చేసి ఎంక్వైరీకి రావాలని నోటీసులు అందజేశారు. ఇక రేవ్ పార్టీ కేసులో నటి హేమ విచారణకు హాజరవుతారా.. హాజరైతే ఏం చెబుతారు వంటి అంశాలు ఆసక్తిగా మారాయి.

Similar News