తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు

పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

Update: 2024-04-18 11:09 GMT

దిశ ప్రతినిధి, నిజామబాద్ : పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి సత్యనారాయణ, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా భుక్యా నందు నామినేషన్ లు వేశారని వివరించారు. తొలిరోజు నామినేషన్ లు దాఖలు చేసిన వారిలో

    ఎన్నికల సంఘం గుర్తింపు లేని వారు కావడంతో వారిని స్వతంత్రులుగా గుర్తిస్తామని తెలిపారు. రెండో రోజు శుక్రవారం బీజేపీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన తొలి సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ఆనంతరం పాత కలెక్టర్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిధిగా మాజీ మంత్రి హరిష్ రావు హాజరు కానున్నట్టు తెలిసింది.  


Similar News