బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ హలీం సస్పెన్షన్

బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ బుధవారం సస్పెన్షన్ కు గురయ్యారు.

Update: 2024-05-22 15:11 GMT

దిశ, బాన్సువాడ : బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ బుధవారం సస్పెన్షన్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వలను నిర్మల్ జిల్లా కలెక్టర్ దివ్య ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గా పని చేస్తున్న హలీ నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కమిషనర్ గా పని చేశారు. అక్కడ పని చేస్తున్న సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలను నిర్మించుకోవడమే కాకుండా ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించి అక్రమంగా నిర్మించుకునే వారికి సహకరిస్తూ అక్రమ భవన నిర్మాణాలకు, ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు అంటగట్టి తదితర అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ జరిగింది. అది నిజమని తేలిందని, దీంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ విషయమై అయినను వివరణ కోరగా తనను సస్పెండ్ చేస్తూ వెలువడిన ఉత్తర్వులు నిజమేనని తెలిపారు.

Similar News