సోనియా తెలంగాణ ప్రజల తల్లి లాంటిది కాదు...బలి దేవత

ఆనాటీ తెలంగాణ బలిదేవత సోనియమ్మ ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లాయింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ప్రశ్నించారు.

Update: 2024-05-24 10:56 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : ఆనాటీ తెలంగాణ బలిదేవత సోనియమ్మ ఈనాడు తెలంగాణ తల్లి ఎట్లాయింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ప్రశ్నించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తుంటే వారి కన్న తల్లిదండ్రుల కడుపుకోత చూడలేక దివంగత కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్ తెలంగాణ రాష్ట్రానికి పూర్తి మద్దతు పలికినట్టు తెలిపారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని అణచివేయాలని చూసిర్రు అని, ఆంధ్ర నాయకులకు అమ్ముడుపోయి తెలంగాణ బిడ్డల ప్రాణాలు

     పోతుంటే పదవే ముఖ్యం అని గోడమీద పిల్లిలా వ్యవహరించిన ఘనత కాంగ్రెస్ నాయకులదని అన్నారు. తెలంగాణ సాధించడంలో, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులు చేసింది శున్యం అన్నారు. తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్ 10 ఏళ్లు దోచుకుంటే ఇప్పుడు మన రేటెంతన్న ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి తెలంగాణను ఇంకా అప్పుల కుప్పచేసి ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మే పనిలో ఉన్నాడని ఆరోపించారు. తెలంగాణ సొమ్మంతా ఢిల్లీకి దోచిపెడుతున్నాడని మండిపడ్డారు.

    అదే విధంగా నిరూపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పాత కలెక్టర్ గ్రౌండ్ లో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం, నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు తదితర అంశాల పైన కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు కి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ అనంతరం వాటిని పరిష్కరించడానికి సహకరిస్తానని అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, బీజేపీ కార్పొరేటర్స్ మల్లేష్ యాదవ్, సుంకరి నారాయణ, మాస్టర్ శంకర్, ముత్యాలు, ఎర్రం సుధీర్ , బీజేపీ నాయకులు గడ్డం రాజు, ఇల్లందుల ప్రభాకర్, ఇప్పకయల కిషోర్, బైకన్ మధు, పంచరెడ్డి శ్రీధర్, బద్దం కిషన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Similar News