విద్యుత్ షాక్‌కు గురైన పలగడ్డతండా వాసులు.. సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా

వ్యవసాయ పనులు ముగించుకుని నిద్రమత్తులోకి జారుకునే సమయంలో ఒక్కసారిగా ఆ గ్రామంలోని ప్రజలంతా విద్యుత్ షాక్‌కు గురయ్యారు.

Update: 2024-05-24 02:38 GMT

దిశ, తాడ్వాయి: వ్యవసాయ పనులు ముగించుకుని నిద్రమత్తులోకి జారుకునే సమయంలో ఒక్కసారిగా ఆ గ్రామంలోని ప్రజలంతా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఊళ్లో ఉన్న ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా కావడంతో అందురూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరికి షాక్ తగిలి గాయలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రాజంపేట్ మండలం పలగడ్డతంతాలో నివాస గృహాలకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో గ్రామస్థులంతా కేకలు వేస్తూ ఇళ్లలోంచి బయటకు పరిగెత్తారు. ఈ ప్రమాదంలో విద్యుత్ షాక్ తగిలిన శ్రీనివాస్ వీపు భాగంలో బొబ్బలు వచ్చాయి. ఈ క్రమంలో టెస్టర్ పట్టుకుని ఇంటి గోడ, ఇంట్లోని వస్తువులను చెక్ చేయగా.. అన్నింటికి కరెంటు సప్లై అవుతోంది. దీంతో గ్రామస్థలంతా కొండాపూర్‌లో ఉన్న సబ్‌స్టేషన్‌ను ముకుమ్మడిగా ముట్టడించారు. తమను చంపుదామని అనుకుంటున్నారా అంటూ మహిళలు అక్కడున్న సిబ్బందిని నిలదీశారు. అనంతరం సబ్‌స్టేషన్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అసలు సమస్య ఎక్కడుందో కనిపెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

Similar News