వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రవీందర్ సింగ్

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో నిజాంసాగర్ మండలం వెల్గనూరు శివారులో కేతకి రైస్ మిల్లును పరిశీలించారు.

Update: 2023-05-15 15:11 GMT

దిశ, నిజాంసాగర్: తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో నిజాంసాగర్ మండలం వెల్గనూరు శివారులో కేతకి రైస్ మిల్లును పరిశీలించారు. అనంతరం మంగుళూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వరి ధాన్యం కుప్పలను, కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అచ్చంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కె.నరసింహారెడ్డితో మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆయన సూచించారు. ఆయన వెంట డీ.ఎస్.వో, డీఎం, సీఈవో, సంగమేశ్వర గౌడ్, రైతులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read..

Kamareddy: తరుగు విషయంలో ఫిర్యాదుల జోరు 

Tags:    

Similar News