ఆగని అక్రమ ఇసుక రవాణా

బిచ్కుంద మండలంలోని గుండెనేమల్లీ క్వారీ నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు.

Update: 2022-09-29 15:30 GMT

దిశ, పిట్లం : బిచ్కుంద మండలంలోని గుండెనేమల్లీ క్వారీ నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. గురువారం సాయంత్రం నుండి అక్రమ ఇసుక రవాణాలను గ్రామస్తులు అడ్డగించినప్పటికీ క్వారీ నడిపిస్తున్న యజమానులు ఎవరిని లెక్కచేయకుండా అక్రమంగా లారీల్లో లోడ్ చేసుకుంటూ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చిల్లేరు గ్రామ చౌరస్తాలో లారీని అడ్డుకొని నిలిపివేశారు. ఇలాంటి అనుమతుల పత్రాలు లేకుండా అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహించారు. అక్రమ రవాణా చేస్తున్న ఇసుక లారీలను నిలిపివేసే వారు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు.

Tags:    

Similar News