నిజామాబాద్‌కు పసుపు‌తో బ్రాండ్ క్రియేట్ చేయాలి: ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్ పసుపు పంట రైతులు పసుపును ఎగుమతి చేస్తున్నారని, ఎగుమతి చేయడం మానుకుని భవిష్యత్తులో రానున్న పరిశ్రమలతో పసుపు పంటను వ్యాపారం చేయడం అలవర్చుకొని రైతులు వ్యాపారస్తులుగా మారాలని నిజామాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.

Update: 2024-05-06 05:46 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ పసుపు పంట రైతులు పసుపును ఎగుమతి చేస్తున్నారని, ఎగుమతి చేయడం మానుకుని భవిష్యత్తులో రానున్న పరిశ్రమలతో పసుపు పంటను వ్యాపారం చేయడం అలవర్చుకొని రైతులు వ్యాపారస్తులుగా మారాలని నిజామాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో సోమవారం ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా అంకాపూర్ రైతులతో ఎంపీ అరవింద్ చాయ్ సేవించి కాసేపు ముచ్చటించారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పసుపు కచ్చితంగా సుమారు 20 వేల ధర పలుకుతుందని చెప్పానని గుర్తు చేశారు. కానీ ఈ సారి 20 వేల మార్క్ ధరను పసుపు పంట దాటడం శుభ పరిమాణం అన్నారు. రెండు మూడేళ్ల సంవత్సరాల వ్యవధిలోనే పసుపు పంట తప్పకుండా 30 వేల ధర పలకనుందన్నారు. గతంలో రెండు మూడేళ్లు అతి భారీ వర్షాల వల్ల పసుపు రైతులు బాగా నష్టపోయారని పసుపు పంట మురికి కుళ్ళి పోయిందన్నారు.

ప్రస్తుతం పసుపు పంట 1600 కోట్లు ఎగుమతి అవుతుందన్నారు. కానీ పసుపు బోర్డు లక్ష్యం 6500 కోట్ల పసుపు పంటను ఎగుమతి చేయడం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటు చేయనున్న పసుపు బోర్డు ప్రధాన ఉద్దేశమే 6500 కోట్ల పసుపు పంట ఎగుమతి అన్నారు. భారతీయ జనతా పార్టీలో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. బీజేపీలో పైరవీలకు తావుండదని, పార్టీ ఉన్నతి కోసం పనిచేసే వారికే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి పార్టీ పెద్దలు కలిసి 10 మంది మంత్రులకు, 105 సిట్టింగ్ ఎంపీలకు టికెట్లను కేటాయించలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దీన్ని బట్టే బిజెపిలో పైరవీలకు తావుండదని పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బిజెపి నాయకులు పల్లె గంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, యామాద్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News