నీట్ పరీక్ష ప్రశాంతం.. 3,142 అభ్యర్థులు పరీక్షకు హాజరు

మెడికల్ కోర్సులో ప్రవేశం కొరకు నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

Update: 2023-05-07 13:59 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మెడికల్ కోర్సులో ప్రవేశం కొరకు నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 3,183 అభ్యర్థులకు గాను 3,142 అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 41 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్ష కొనసాగింది. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం ఒక గంట ఐదు నిమిషాల సమయం అదనంగా ఇచ్చారు. నీట్ పరీక్ష ప్రశాంతంగా జరగడానికి అన్ని విధాలుగా సహకరించిన పాఠశాలల, కళాశాలల యాజమాన్యానికి, పోలీస్, విద్యుత్ శాఖ వారికి, బ్యాంకు సిబ్బందికి, హెల్త్ డిపార్ట్ మెంట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ భాస్కర్ మెరిగ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News