పదవతరగతి పరీక్షలో ఉత్తీర్ణత శాతం పెంచాలి..

ఏప్రిల్ 4 ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణత శాతంతో పాటుగా ఎక్కువగా 10 జీపీఏ వచ్చేలా ప్రణాళికలు చేసి విద్యార్థులను సంసిద్ధం చేయాలని డీఈఓ దుర్గాప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు.

Update: 2023-03-03 12:31 GMT

దిశ, నవీపేట్ : ఏప్రిల్ 4 ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణత శాతంతో పాటుగా ఎక్కువగా 10 జీపీఏ వచ్చేలా ప్రణాళికలు చేసి విద్యార్థులను సంసిద్ధం చేయాలని డీఈఓ దుర్గాప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు. రెంజల్ మండలంలోని కేజీబీవీ, మోడల్, జడ్పీహెచ్ఎస్ లతో పాటు సాటాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.

మన ఊరు.. మన బడిలో జరుగుతున్న పనులను, 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చేనెలలో ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షల కొరకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, సరైన ప్రణాళికలతో ప్రత్యేక తరగతులు నిర్వహించి అత్యధిక 10 జీపీఏలు వచ్చేలా కృషి చేయాలని తెలిపారు. సాయంత్రం సమయంలో 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ గణేష్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News