ఆర్మూర్లో జీవన్ రెడ్డి మాల్ రీ ఓపెన్

స్థానిక ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ అండ్​ మల్టీప్లెక్స్ శుక్రవారం రీ ఓపెన్ అయింది.

Update: 2024-05-24 11:00 GMT

దిశ, ఆర్మూర్ : స్థానిక ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ అండ్​ మల్టీప్లెక్స్ శుక్రవారం రీ ఓపెన్ అయింది. ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి మాల్ ను ఈనెల 16వ తేదీన హైదరాబాద్ కు చెందిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆర్టీసీ పోలీసుల, సివిల్ పోలీసుల పర్యవేక్షణలో సీజ్ చేసిన విషయం తెలిసిందే. విష్ణుజిత్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ పేరు మీద లీజుకు తీసుకున్న ఆశన్న గారి రజిత రెడ్డి హైకోర్టును ఆశ్రయించి ఆర్టీసీ అధికారులు వేసిన సీజ్ పై ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల

    మేరకు శుక్రవారం పట్టణ కేంద్రంలోని జీవన్ రెడ్డి మాల్ ను ఆర్మూర్ ఆర్టీసీ అధికారులు రీ ఓపెన్ చేశారు. జీవన్ రెడ్డి మాల్ రీఓపెన్ కావడంతో జీవన్ రెడ్డి మద్దతుదారులు, శ్రేయోభిలాషులు, అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గత వారం రోజులుగా జీవన్ రెడ్డి మాల్ మూసివేతతో మాల్ లోని దుకాణాలు మొత్తం మూతపడడంతో మాల్ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. శుక్రవారం మాల్ రీ ఓపెన్ కావడంతో జీవన్ మాల్ చుట్టూర పరిసరాల్లో జనంతో సందడి వాతావరణం నెలకొంది. 

Similar News