ధాన్యం బస్తాలను తరలించి కేంద్రాలను క్లోజ్ చేయాలి

కాంటా అయిన ధాన్యం బస్తాలను తరలించి కొనుగోలు కేంద్రాలను క్లోజ్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ నిర్వాహకులను ఆదేశించారు.

Update: 2024-05-26 12:46 GMT

దిశ, భిక్కనూరు : కాంటా అయిన ధాన్యం బస్తాలను తరలించి కొనుగోలు కేంద్రాలను క్లోజ్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ నిర్వాహకులను ఆదేశించారు. ఆదివారం ఆయన భిక్కనూరు మండలంలోని అంతంపల్లి, రామేశ్వర్ పల్లి, భిక్కనూరు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు పలు రైస్ మిల్లులను విజిట్ చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 307 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, ఇంకా 43 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి కావలసి ఉందన్నారు. ఈ రెండు రోజుల్లో మరికొన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. ఈరోజు ఒక్కరోజే ధాన్యాన్ని రవాణా చేసేందుకు 116 లారీలు సమకూర్చి 2,795 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని

     తరలించినట్టు తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం ఆదేశానుసారం మిల్లర్లు లోడ్ పాయింట్లు పెంచుకొని రోజుకు 15 నుంచి 18 లారీల ధాన్యాన్ని దించుకుంటున్నారన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 51,493 మంది రైతుల నుంచి 664 కోట్ల విలువ చేసే 3,01,545 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, 90 శాతం మంది రైతులకు 572 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని వివరించారు. 95 శాతం ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో వారికి డబ్బులు కూడా చెల్లిస్తామని చంద్రమోహన్ వివరించారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల ఇంచార్జ్ మేనేజర్ నిత్యానందం, ఎన్ ఫోర్స్ మెంటు డీటీ కిష్టయ్య, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు తదితరులు ఉన్నారు. 

Similar News