రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసుల విస్తృతస్థాయి తనిఖీలు

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలబత్పూర్ చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ విస్తృతస్థాయి తనిఖీలు జరిపారు.

Update: 2022-10-02 15:00 GMT

దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలబత్పూర్ చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ విస్తృతస్థాయి తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న దసరా పండుగ నేపథ్యంలో మహారాష్ట్ర నుండి తెలంగాణకు ఎటువంటి మద్యం గాని, దేశి సరుకు గాని, నాటు సారాగాని రానివ్వకుండా గోజేగవ్, మీర్జాపూర్, చిన్న శక్కర్గ, పెద్ద శక్కర్గ, కేలూర్, చిన్నతడుగుర్, పెద్దతడుగూర్ లాంటి గ్రామాల సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా దేశీ నాటు సరుకు విక్రయాలు చేపట్టినట్లయితే ఎక్సైజ్ శాఖ తరపున కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణతో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News