తగలబడిన డీఆర్డీఏ ఓల్డ్ రికార్డుల రూం

నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పాత రికార్టుల గది అగ్నికి ఆహుతైంది.

Update: 2024-05-24 11:12 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పాత రికార్టుల గది అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. నిజామాబాద్ డీఆర్డీఏ కు రికార్డు రూం నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామంలో ఉంది. శుక్రవారం ఉదయం టీటీడీసీ- డీఆర్డీఏ రికార్డుల రూం నుంచి పొగలు, మంటలు వస్తున్నాయని అగ్నిమాపక శాఖ కు సమాచారం అందించాడు వాచ్ మెన్ ఓడ్డెన్న. అప్పటికే డిచ్ పల్లిలోని సీఎంసీ లోని పోలింగ్ కేంద్రం వద్ధ ఉన్న ఓ పైర్ ఇంజన్, జిల్లా కేంద్రంలోని పైర్ స్టేషన్ నుంచి మరో పైర్ ఇంజన్ అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    పాత రికార్డుల గది రూంలోని ఉమ్మడి జిల్లా మొదలుకొని ప్రస్తుతం వరకు పాత రికార్డులు అగ్ని కిలలకు ఆహుతి అయ్యాయి. అగ్ని మాపక శాఖ నిజామాబాద్ ఫైర్ స్టేషన్ అధికారి నర్సింగ్ రావు తన సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లేకపోతే పాత రికార్డుల గది పక్కన ఉన్న ట్రైనింగ్ సెంటర్ లోని మరోగదికి మంటలు అంటుకొని ఉంటే కంప్యూటర్ లు బుగ్గిపాలు అయ్యేవి. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ డీఆర్ డీఏ పీడీ సందర్శించారు. రెండు సంవత్సరాల క్రితం కొత్త కలెక్టరేట్ లోకి ప్రగతి భవన్ లో ఉన్న డీఆర్ డీఏ కార్యాలయం తరలించినప్పుడు పాత రికార్డులను ఎందుకు తరలించలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . దాదాపు పాత రికార్డులు కాలి బూడిద కావడంతో వివరాలపై సందిగ్ధం నెలకొంది. అగ్ని ప్రమాదంపై పోలీస్, అగ్ని మాపక శాఖ విచారణ చేపట్టాయి. షార్ట్ సర్క్యూట్ కారణం అని చెబుతున్నా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Similar News