బీఆర్ఎస్కు భారీ షాక్
బీఆర్ఎస్కు భారీషాక్ తగిలింది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దిశ, ఎల్లారెడ్డి : బీఆర్ఎస్కు భారీషాక్ తగిలింది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనా రాయణ బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే మదన్మోహన్ చేస్తున్న అభివృద్ధి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజలకు అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.