హసన్ పల్లిలో సర్కారు భూమి కబ్జాకు యత్నం

ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తూ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని కొందరు తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన ఘటన హసన్ పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

Update: 2023-05-18 13:24 GMT

రెవిన్యూ అధికారులు సూచీబోర్డు ఏర్పాటు అగని ఆక్రమణ

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తూ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని కొందరు తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన ఘటన హసన్ పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. సర్వే నెం.69, 70/5లో ప్రభుత్వానికి 7 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. అది కొందరికి గతంలో కేటాయించినట్లు ఉండగా ఈ తరువాతి కాలంలో వాటిని రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఇటీవల కాలంలో సంబంధిత భూమిలో వ్యవసాయ పనులు జరుగుతుండంతో అక్కడ మండల తహసీల్దార్ సంబంధిత వ్యవసాయ భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ వీఆర్ఏల ద్వారా ప్రభుత్వ భూమి అంటూ సూచీ బోర్డును ఏర్పాటు చేయించారు. ఈ విషయంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు న్యాయస్థానంతో పాటు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి కబ్జాపై తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు.

సంబంధిత భూమిని కబ్జా కాకుండా చూడాలని కోరారు. ఈ విషయంలో తహసీల్దార్ నారాయణ వివరణ ఇస్తూ నిజాంసాగర్ మండలం హసన్ పల్లి గ్రామ శివారులో సర్వే నెం.70/5లో 7 ఎకరాల 5 గుంటల భూమి ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News