జానకమ్మపేట్ చెరువు వద్ద యువతి పై దాడి

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు యువతిపై దాడి చేశారు.

Update: 2024-05-23 09:09 GMT

దిశ ప్రతినిది, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు యువతిపై దాడి చేశారు. ఈ సంఘటనలో యువతి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఉదయం మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన వారు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో యువతిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట చెరువు వద్ద వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని యువతిని గుర్తు తెలియని

    వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. యువతి మాట్లాడలేని స్థితిలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతి కోలుకుంటే కానీ ఆమెపై జరిగిన దాడి గురించి తెలిసే అవకాశం లేదు. యువతి పై దాడి చేసి చెరువు వద్ద పడేసి ఉంటారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యువతి స్పృహలోకి వస్తే కానీ తనపై జరిగిన దాడి, అమనుషల గురించి వెల్లడిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. బుధవారం రాత్రి జానకంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. యువతి తల్లిదండ్రులు ఆమెను గుర్తించి ఫిర్యాదు చేస్తే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

Similar News