అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వసతులు కల్పించాలి

అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో వసతులు కల్పించాలని, పాఠశాలలో మౌలిక వసతులైన విద్యుత్, తాగు నీరుతో పాటు చిన్న చిన్న మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.

Update: 2024-04-16 12:26 GMT

దిశ, కామారెడ్డి క్రైమ్ : అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో వసతులు కల్పించాలని, పాఠశాలలో మౌలిక వసతులైన విద్యుత్, తాగు నీరుతో పాటు చిన్న చిన్న మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపిక చేసిన కామారెడ్డి మండలం గర్గుల్ ఎంపీపీఎస్ పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో చేపట్టిన వివిధ పనులను

     పరిశీలిస్తూ పనులను వేగిరం చేయాలన్నారు. 20 లీటర్ల సామర్థ్యం గల రెండు ఆర్ఓ ట్యాంకులను ఏర్పాటు చేయాలని, టాయిలెట్ శుభ్రంగా ఉంచాలని, గచ్చు ఊడిపోయిన చోట మరమ్మతులు, పాఠశాల పునరుద్ధరణ పనులు గడువులోగా పూర్తిచేయాలన్నారు. ఆఫీసు రూమ్లో, కారిడార్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంఈఓ ఎల్లయ్య, గ్రామ మహిళా సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. 

Similar News