ఎల్లారెడ్డిలో డెంగ్యూతో బాలుడు మృతి

ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ప్యాలల కృష్ణ కుమారుడు మణిదీప్ (11) డెంగ్యూ వ్యాధితో 20 రోజుల నుండి హైదరాబాద్​లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Update: 2024-05-22 15:05 GMT

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ప్యాలల కృష్ణ కుమారుడు మణిదీప్ (11) డెంగ్యూ వ్యాధితో 20 రోజుల నుండి హైదరాబాద్​లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. డెంగ్యూ వ్యాధితో మృతి చెందడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలోని ఏడో వార్డులో ఇంటింటి సర్వే నిర్వహించారు. సర్వేలో ప్రజల రక్త నమూనాలు

    సేకరించి పలువురికి మాత్రలు పంపిణీ చేశారు. సర్వేలో భాగంగా డిప్యూటీ డీఎంహెచ్వో శోభారాణి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రజలు శ్రద్ధ వహించాలని, నిర్లక్ష్యం వీడి తమ ఆరోగ్యాన్ని తామే రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ చూసుకోవాలని కోరారు. తమ ఇంటి పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శరత్ కుమార్, సూపర్వైజర్ రాణి, ఆరోగ్య బోధకులు ఇందిర, ఆశ కార్యకర్తలు సంధ్య, విజయ పాల్గొన్నారు.

Similar News