బ్రేకింగ్: త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇంద్రసేనా రెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ బుధవారం ఉత్తర్వులు జారీ
దిశ, సిటీ బ్యూరో: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన మరో ఇద్దరు సీనియర్ నేతలను గవర్నర్ పదవీ వరించింది. త్రిపుర, ఒడిశా రాష్ర్టాలకు ఇద్దరు బీజేపీ నేతలను గవర్నర్లుగా నియమిస్తూ బుధవారం రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనా రెడ్డిని, ఒడిశా రాష్ట్ర గవర్నర్‌గా రఘుబర్ దాస్‌లను నియమిస్తూ రాష్ట్రప్రతి కార్యాలయం ఓ పకటనలో వెల్లడించింది. నల్లు రాంరెడ్డి దంపతులకు 1953 జనవరి 1న జన్మించిన ఇంద్రసేనా రెడ్డి.. హైదరాబాద్ నగరంలోని మలక్ పేట నియోజకవర్గం నుంచి 1983,1985,1999 లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ శాసన సభ పక్ష నేతగా వ్యవహారించారు. నల్లు ఇంద్రసేనా రెడ్డి 2003లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా వ్యవహారించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శగా 2014 నుంచి వ్యవహారిస్తున్నారు. 2020 బీజేపీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు.
జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎంగా సేవలందించిన రఘుబర్ దాస్‌ను కూడా ఒడిశా రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. 1955 మే 3 వ తేదీన జన్మించిన రఘుబర్ దాస్ 2014 డిసెంబర్ 28న జార్ఖండ్ రాష్ట్రానికి ఆరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం క్రితం ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా. కే. లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటును కేటాయించిన కేంద్రం ఇపుడు రాష్ట్రానికి చెందిన మరో సీనియర్ నేత నల్లుకు గవర్నర్ పదవీ కేటాయించటంతో తెలంగాణ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందనే చర్చ లేకపోలేదు.