నన్ను మూడు సార్లు చంపాలని చూశారు

నన్ను మూడు సార్లు చంపాలని చూశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన కామెంట్​ చేశారు.

Update: 2024-05-25 09:38 GMT

దిశ,నల్లగొండ : నన్ను మూడు సార్లు చంపాలని చూశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన కామెంట్​ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ కు ముందు పెగ్గు, తినడానికి లెగ్గు ఉంటే సరిపోతుందన్నారు. 4వ తేదీన నీకు రెండు వైపులా డాక్టర్లను పెట్టుకో అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని, ఆఖరికి బాత్రూం కడగటానికి స్కావెంజర్లు కూడా లేరని అన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు అన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అన్నారు. రైతులు అరిగోస పెట్టే పరిస్థితి బీఆర్ ఎస్ పార్టీ తీసుకొచ్చిందన్నారు. అడ్వకేట్ దంపతులను హత్య చేసిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు.

     కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు అన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యకు కేసీఆర్ కుటుంబం కారణం అని పేర్కొన్నారు. కోవిడ్ వస్తే మోడీ పిలుపు మేరకు ప్రజలకు సేవ చేశామని, 8 వేల మంది బీజేపీ నాయకులను కోల్పోయామని గుర్తు చేశారు. తనపై 105 కేసులు పెట్టారని, 12 సార్లు జైలుకు వెళ్లి వచ్చానని, 3 సార్లు తనని చంపాలని చూశారని ఐదేళ్లు తన కుటుంబానికి దూరం అయ్యానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డి అధికారం కోసం పోటీ చేయడం లేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు పోటీ చేస్తున్నట్టు చెప్పారు. 15 నిమిషాల్లో హిందువులను చంపుతాం అన్న ఓవైసీ తో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని, వారికి ఓటు వేయొద్దు అన్నారు. ఓల్డ్ సిటీలో మీటింగ్ ఎవరు పెడతారో చూస్తాం అని ఓవైసీ అన్నాడని భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల వద్ద బీజేపీ మీటింగ్ పెట్టినట్టు చెప్పారు. ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డి, మాదగోని శ్రీనివాస్, విరెళ్లి చంద్ర శేఖర్, పిల్లి రామరాజు పాల్గొన్నారు. 

Similar News