గాలివానకు పార్కింగ్ షెడ్డు కూలి బైకులు ధ్వంసం

నల్లగొండలో భారీ ఈదురుగాలులు, వానకు నల్గొండ పట్టణంలో గల బస్టాండ్ ఆవరణలో ఉన్న సైకిల్, స్కూటర్ పార్కింగ్ ఏరియాలో ఉన్న రేకుల షెడ్ పూర్తిగా ధ్వంసం అయింది.

Update: 2024-05-26 15:42 GMT

దిశ,నల్గొండ: నల్లగొండలో భారీ ఈదురుగాలులు, వానకు నల్గొండ పట్టణంలో గల బస్టాండ్ ఆవరణలో ఉన్న సైకిల్, స్కూటర్ పార్కింగ్ ఏరియాలో ఉన్న రేకుల షెడ్ పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో పాటు ఆ పార్కింగ్ ఏరియాలో పెట్టిన వాహనాలు సైతం డ్యామేజ్ అయ్యాయి. దాదాపు రెండు లక్షల వరకు నష్టం వాటిలిందని పార్కింగ్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు.

Similar News