మొదటి రోజు అప్లికేషన్ల గొడవ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేయడం కోసం ప్రజా పాలన పేరుతో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కార్యక్రమాన్ని చేపట్టింది.

Update: 2023-12-28 14:17 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేయడం కోసం ప్రజా పాలన పేరుతో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని పానగల్ ఒకటో వార్డులో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. స్వీకరించడానికి ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక ప్రత్యేక కౌంటర్ మహిళల నుంచి దరఖాస్తుల స్వీకరణ, రేషన్ కార్డులు లేని వాళ్ల కోసం మరోక కౌంటర్ ఏర్పాటు చేశారు.

దరఖాస్తుల కొరత....

కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికి లబ్ధిదారులు దరఖాస్తు ఫారాల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు కేవలం 10 నిమిషాల్లోనే దరఖాస్తులు లేవని అక్కడున్న బృందం సభ్యులు చేతులెత్తేశారు. దరఖాస్తు ఫారాలను స్థానిక కౌన్సిలర్ తీసుకువెళ్లారని, అందుకే ఇప్పుడు కొరత ఏర్పడిందని పేర్కొంటున్నారు. దీంతో అక్కడున్న పేదలు తాము రోజు కాయ కష్టం చేసుకుని పొట్ట పోసుకొనేవాళ్ళం పని వదిలేసి దరఖాస్తు చేసుకోడానికి వచ్చాం., ఇపుడు లేవు అంటే ఎలా ..అని కొంతమంది అధికారులను అక్కడ ఉన్న పేదలు నిలదీశారు. దీంతో ఆ వార్డు నోడల్ ఆఫీసర్ దరఖాస్తులు తెప్పించే చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో కొంత గందరగోళం సర్దుమనిగింది. అంతేకాకుండా జనవరి ఆరో తేదీ వరకు ఇక్కడ దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధికే దరఖాస్తు ఫారాలను పూర్తిస్థాయిలో అప్పగించాలని ప్రభుత్వాన్నికి నిబంధన ఉన్నట్లు తెలుస్తుంది. ఆ నిబంధన మేరకే స్థానిక ప్రజాప్రతినిధికి దరఖాస్తు ఫారాలు అప్పగించాల్సి వస్తుందని, పూర్తి పూర్తిస్థాయిలో అందుబాటులో పెట్టేవాళ్లమంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దరఖాస్తుల అందజేతలో మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ మూడింటి కోసమే అధికంగా....

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలలో పేదలు ప్రధానంగా మూడింటి కోసమే అధికంగా దరఖాస్తులు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. ప్రతి పేద మహిళలకు అందజేసే మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి పథకాల కోసం ఎక్కువ మంది పేదలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ పథకాలు పేదలకు అంది ఇవ్వాలంటే కచ్చితంగా రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డు లేని పేదలకు.... ఇప్పటివరకు కార్డులు ఇస్తారు ..పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు.. అనే ఆందోళన అక్కడున్న పేదల్లో కనిపించింది. ఇదిలా ఉంటే చేయూత పథకం పేరుతో పెన్షన్ పెంచినందున ఇప్పటికే పెన్షన్ పొందుతున్న దివ్యాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఇప్పుడు అప్లై చేసుకోవాలా లేదా స్పష్టత లేక కొంత గందరగోళం ఏర్పడింది.

దరఖాస్తుల పూర్తికి తిప్పలు...

అభయహస్తం దరఖాస్తు ఫారం ఇవ్వడానికి పేదలు చాలా తిప్పలు పడ్డారు. జిల్లా కేంద్రంలో పానగల్ ప్రాంతం మాస్ ఏరియా, అక్కడ ఎక్కువగా నిరక్షరాస్యలే నివసిస్తుంటారు. అందుకే ఈ ఫారాలు నింపడం వాళ్లకు తెలియదు. ఫారాలు నింపడానికి కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని ప్రభుత్వం అధికారులకు పదేపదే చెప్పింది కానీ ఇక్కడ అది జరగలేదనిపిస్తుంది... జనం దాటికి తట్టుకోలేక అదే సమయంలో అక్కడ ఇంటింటి సర్వే చేస్తున్న ఫార్మసీ విద్యార్థినిలు, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఫారాలు నింపడంతో అక్కడున్న పేదలంతా కొంత ఊపిరి పీల్చుకున్నారు.

నోడల్ అధికారి సందర్శన...

ప్రజా పాలన ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారి ఆర్‌వి కర్ణన్ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. దరఖాస్తుల స్వీకరిస్తున్న కౌంటర్ దగ్గరికి వెళ్లి దరఖాస్తు ఫారం అందజేస్తున్న పేదలతో, మరోవైపు స్వీకరిస్తున్న అంగన్వాడీ టీచర్‌తో స్వయంగా మాట్లాడారు . ఏలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. ఫారాలు నింపడానికి పేదలకు ఇబ్బంది కలిగితే బృందం సభ్యులు వాళ్లకు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా కొంతమంది స్థానికులు రేషన్ కార్డు సమస్యలను ఆయనకు వివరించగా దానికోసం కూడా తెల్ల కాగితంపై రాసి ఇవ్వాలని పేదలకు సూచించారు.

Read More..

కవిత... తొందర పడRead More..కు...పాత బకాయిలు మీ నుంచి కట్టిస్తాం 

Tags:    

Similar News