ఇందిరమ్మ రాజ్యంతోనే దేశం పురోగతి

ఇందిరమ్మ రాజ్యంతోనే దేశం పురోగతి చెందుతుందని, అందుకు ఈనెల 13న జరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి చెయ్యి గుర్తుపై ఓటు వేసి ఇందిరమ్మ వారసుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Update: 2024-05-11 12:10 GMT

దిశ, వలిగొండ : ఇందిరమ్మ రాజ్యంతోనే దేశం పురోగతి చెందుతుందని, అందుకు ఈనెల 13న జరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి చెయ్యి గుర్తుపై ఓటు వేసి ఇందిరమ్మ వారసుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వలిగొండ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన సాగుతుందని,

     దేశంలో కూడా ఇందిరమ్మ పాలన రావడానికి ప్రతి ఒక్కరూ పూనుకోవాలని, భారత దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ వారసుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని అన్నారు. మోడీకి హటావో దేశ్ కి బచావో అన్న నినాదంతో ప్రజలకు వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ సర్పంచ్ పబ్బు ఉపేందర్ బోస్, కుంభం విద్యాసాగర్ రెడ్డి, బోళ్ల శ్రీనివాస్, కంకల కిష్టయ్య, బత్తిని సహదేవ్, కాసుల వెంకన్న, బత్తిని సైదులు గౌడ్, ఐటి పాముల రవీంద్ర, ఎమ్మె లింగస్వామి, నవీన్, పర్వతం నరసింహ పాల్గొన్నారు. 

Similar News