కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ గా పోటీ చేసే అభ్యర్థులు బీజేపీ నుండి పోయిన వాళ్లే

కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ గా పోటీ చేసే అభ్యర్థులు బీజేపీ నుండి పోయిన వాళ్లే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

Update: 2024-05-22 14:42 GMT

దిశ,నల్లగొండ : కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ గా పోటీ చేసే అభ్యర్థులు బీజేపీ నుండి పోయిన వాళ్లే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించాలి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు బీజేపీ నుండి బయటకు వెళ్లిన వ్యక్తులే అన్నారు. పట్టభద్రుల ఓటు ఎవరికి వేస్తే సద్వినియోగం అవుతుందో ఆలోచన చేసి బీజేపీ అభ్యర్థి కి వేయాలని,

    గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విద్యార్థులు సమస్యల మీద అలాగే నిరుద్యోగుల కోసం మాట్లాడే వ్యక్తి అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలకి మోసపోయి ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారన్నారు. పరిపాలన ఎలా చేయాలో తెలియని పరిస్థితి లో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే పదవికి రాజీనామా చేసి వెళ్లాడని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ని పార్టీలు మారాడో అందరికీ తెలుసన్నారు. రాబోయే పార్లమెంట్ ఫలితాలలో 12 స్థానాలను గెలుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, మాదగోని శ్రీనివాస్, విరెళ్లి చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News