గ్రామపంచాయతీ కార్మికులుగా సర్పంచ్, ఉపసర్పంచ్

మండలంలోని అభంగాపురం గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెకు వెళ్లడంతో గ్రామంలో పారిశుద్ధ్య పనులు కుంటుపడ్డాయి.

Update: 2023-07-09 08:31 GMT

దిశ, మాడుగులపల్లి : మండలంలోని అభంగాపురం గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెకు వెళ్లడంతో గ్రామంలో పారిశుద్ధ్య పనులు కుంటుపడ్డాయి. దీంతో స్వయంగా సర్పంచ్, ఉప సర్పంచ్ లు పారిశుద్ధ్య కార్మికులుగా మారి ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం తాత్కాలిక సిబ్బందిని రోజువారి వేతనం ఇచ్చి తీసుకోమని చెప్పిన గ్రామంలో ఎవరు కూడా ఆసక్తి చూపకపోవడంతో గ్రామ శుభ్రత కొరకు సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్ అందరు కలిసి ఇంటింటి చెత్తను సేకరిస్తున్నారు.

Tags:    

Similar News