కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ మలి ఉద్యమ దశ అమరుని తల్లి

తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గురువారం గాంధీభవన్లో ఏఐసీసీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ దీపా మున్షి, రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Update: 2024-05-09 16:16 GMT

దిశ, మోత్కూరు: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గురువారం గాంధీభవన్లో ఏఐసీసీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ దీపా మున్షి, రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాంతాచారి ఉద్యమం కోసం తన ప్రాణాన్ని బలిదానం చేసిన పిదపనే ఉద్యమం ఉవ్వెత్తున రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైంది. ఉద్యమంలో తొలి అమరుడైన కుటుంబానికి సరైన ప్రాతినిత్యం ఇవ్వలేదని బహిరంగంగా తల్లి శంకరమ్మ మీడియాలో తన గోడును వెళ్లబోసుకున్న సందర్భంలో ఎన్ని ఉన్నాయి.

అప్పటి ముఖ్యమంత్రి గత ఎన్నికల ముందు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని కలవగానే పిలిచి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు హడావుడి చేశారు. అయినప్పటికీ ఎలాంటి పదవిని బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెట్టలేదు. దీంతో ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం విజయవంతమైందని చెప్పవచ్చు పరోక్షంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు సరైన ప్రాతినిథ్యం గత ప్రభుత్వం కల్పించలేదని భావనతోనే శ్రీకాంతాచారి తల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిందని అభిప్రాయం వెల్లడవుతుంది.

Similar News