ఎమ్మెల్సీ పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి : కలెక్టర్

పట్టబద్రుల పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే.జెండగే పోలింగ్ అధికారులకు సూచించారు.

Update: 2024-05-26 12:24 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : పట్టబద్రుల పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే.జెండగే పోలింగ్ అధికారులకు సూచించారు. వరంగల్ -ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక పురస్కరించుకొని ఆదివారం ఆయన రాయగిరి విద్యాజ్యోతి హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని డీసీపీ రాజేశ్ చంద్రతో కలిసి సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ మెటీరియల్ స్వీకరిస్తున్న పోలింగ్ సిబ్బందితో ఆయన మాట్లాడారు.

కేటాయించిన పూర్తి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ కోసం అన్ని సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. నేడు ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుందని, భువనగిరి డివిజన్ సంబంధించి 22, చౌటుప్పల్ డివిజన్ సంబంధించి 15 కలిపి మొత్తం 37 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిర్వహించబడుతుందని, భువనగిరి డివిజన్ సంబంధించి 7784 మంది స్త్రీలు, 12,421 మంది పురుషులు, చౌటుప్పల్ డివిజన్ సంబంధించి 5458 మంది స్త్రీలు, 8417 మంది పురుషులు కలిసి మొత్తం 34,080 మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోనున్నారని తెలిపారు.

Similar News