బస్సు ఆపకుంటే నీకు మూడిందే.... డ్రైవర్ కు మహిళలు వార్నింగ్

మా వాళ్లు వచ్చే వరకు బస్సు ఆపకుంటే నీకు మూడిందే అని ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు మహిళలు వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-05-25 14:20 GMT

దిశ, నకిరేకల్ టౌన్ : మా వాళ్లు వచ్చే వరకు బస్సు ఆపకుంటే నీకు మూడిందే అని ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు మహిళలు వార్నింగ్ ఇచ్చారు. పైగా మా వాళ్లతో చితక బాదిచ్చి సస్పెండ్ చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే సూర్యాపేట డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తుండగా నకిరేకల్ బస్టాండ్ లో ముగ్గురు మహిళా ప్రయాణికులు బస్సు ఎక్కారు.

    తమ చుట్టపు మనిషి వస్తుంది ఆగమని డ్రైవర్ను ఆ మహిళలు కోరారు. మిగతా వారి కోసం అప్పటికే ఐదు నిమిషాలు ఆపడంతో తోటి ప్రయాణికులు గొడవ చేయడంతో బస్సును డ్రైవర్ ముందుకు కదిలించాడు. దీంతో మహిళలు డ్రైవర్ను బూతులు తిడుతూ సూర్యాపేటకు వెళ్లిన తర్వాత తమ వాళ్లతో చెప్పి చితకబాదిస్తామని హెచ్చరించారు. డ్యూటీ ఎలా చేస్తావో చూస్తామని బెదిరించారు. ఇది మా ఫ్రీ బస్సు అని, మా ఇష్టం వచ్చినంత సేపు ఆగాల్సిందేనని, లేదంటే మా వాళ్లోతో కొట్టించి సస్పెండ్ చేయిస్తామని మాస్​ వార్నింగ్ ఇచ్చారు. 

Similar News