కాళ్లు పట్టుకున్నా కరుణించలే...

ఆమె నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ... ఆపై ఆమెకు అనారోగ్యం...ఒక్క సంతకం కోసం నెల రోజులుగా బతిమిలాడినా గ్రామ పంచాయతీ కార్యదర్శి కరుణించడం లేదు.

Update: 2024-05-25 09:20 GMT

దిశ, మిర్యాలగూడ టౌన్ : ఆమె నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ... ఆపై ఆమెకు అనారోగ్యం...ఒక్క సంతకం కోసం నెల రోజులుగా బతిమిలాడినా గ్రామ పంచాయతీ కార్యదర్శి కరుణించడం లేదు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తుంగపహాడ్ గ్రామానికి చెందిన ఉప్పు రమణ ఇంటి యాజమాన్య సర్టిఫికెట్ కోసం గత నెల రోజులుగా తిరుగుతుంది. అయినా ఆ కార్యదర్శి కరుణించలేదు.

    దీంతో విసుగు చెందిన రమణ శనివారం పంచాయతీ కార్యాలయంలో ఆ పంచాయతీ కార్యదర్శి గంజి యాదగిరి కాళ్లపై పడి వేడుకుంది. అయినా ఆ కార్యదర్శి దరఖాస్తు కాగితాలను విసిరి బయటకు వెళ్లమని హెచ్చరించారు. దీంతో ఈ సంఘటన చూసిన పలువురు అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి గంజి యాదగిరిని వివరణ కోరగా యాజమాన్య హక్కు పత్రం జారీ తమ పరిధిలో ఇవ్వలేనని అన్నారు. 

Similar News