48 గంటలు ఎలాంటి ప్రచారం చేయొద్దు : రిటర్నింగ్ అధికారి

ఈనెల 25 వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 27 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రాజకీయ పరమైన బల్క్ ఎస్ ఎం ఎస్ ల పై నిషేధం ఉంటుందని జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన తెలిపారు

Update: 2024-05-24 15:17 GMT

దిశ, నల్లగొండ: ఈనెల 25 వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 27 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రాజకీయ పరమైన బల్క్ ఎస్ ఎం ఎస్ ల పై నిషేధం ఉంటుందని జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వరంగల్ -ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు గాని,రాజకీయ పార్టీలు గానీ ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వకూడదని ,ఒకవేళ ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బల్క్ ఎస్ఎంఎస్ లు పంపించినట్లయితే చట్ట రీత్యా ఎన్నికల నిబంధనల మేరకు తగు చర్య తీసుకోబడుతుందని తెలిపారు. ఈ విషయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆయా రాజకీయ పార్టీలు, అలాగే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు సైతం దృష్టిలో ఉంచుకొని 25 వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 27 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వవద్దని కోరారు.

Similar News