చేనేత కార్మికులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

నా రాజకీయ ప్రస్థానం ప్రారంభం చేనేత కార్మికులతోనేనని చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జీ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-10 10:57 GMT

దిశ, మునుగోడు: నా రాజకీయ ప్రస్థానం ప్రారంభం చేనేత కార్మికులతోనేనని చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జీ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పథకాలను కొనసాగిస్తూ చేనేత కార్మికులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను గాలికి వదిలిందని, వారికి కనీసం ఎన్నికలు కూడా నిర్వహించలేదన్నారు. చేనేత కార్మికులకు ముడి సరుకులకు సబ్సిడీ ఇస్తే వారు ఆర్థికంగా బలపడేవారన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భువనగిరిలో అవగాహన సదస్సు పెట్టి రైతులతో పాటు చేనేత కార్మికులకు కూడా రుణమాఫీ చేయాలని అప్పటి ప్రభుత్వంతో చర్చలు జరిపి 350 కోట్లు రుణాన్ని మాఫీ చేశామన్నారు. చేనేత కార్మికులకు కష్టసుఖాలు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి చేనేత కార్మికుడు నెలకు 15వేల నుంచి 20వేల వరకు ఆదాయం వచ్చేలా ప్రభుత్వంతో చర్చించి కృషి చేస్తానన్నారు. చేనేత కార్మికుల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.

అదే స్పూర్తితో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోషిక యాదగిరి, మునుగోడు ఎన్నికల ఇంచార్జీ సంధ్యా రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత, రాష్ట్ర నాయకులు నారబోయిన రవిముదిరాజ్, జక్కలి ఐలయ్య యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు బీమనపల్లి సైదులు, నాయకులు పోలగోని సత్యం, జాల వెంకన్న యాదవ్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పాల్వాయి జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News