పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

సికింద్రాబాద్ -గుంటూరు రైలు మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు ఆదివారం పట్టాలు తప్పి ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-05-26 12:11 GMT

దిశ ,మిర్యాలగూడ టౌన్ : సికింద్రాబాద్ -గుంటూరు రైలు మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు ఆదివారం పట్టాలు తప్పి ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీనివలన సికింద్రాబాద్ నుంచి కేరళ వెళ్లవాల్సిన శబరీ ఎక్స్‌ప్రెస్ ను అధికారులు మిర్యాలగూడ రెైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. అంతేకాకుండా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన జన్మభూమి సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అధికారులు నిలిపివేశారు. రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Similar News