సన్నవడ్లకే బోనస్ ప్రకటించి కాంగ్రెస్ రైతులను మోసం చేసింది : కేటీఆర్

దొడ్డువడ్లకు కూడా బోనస్ ఇస్తామని ప్రకటించి సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు.

Update: 2024-05-24 10:40 GMT

దిశ,చౌటుప్పల్: దొడ్డువడ్లకు కూడా బోనస్ ఇస్తామని ప్రకటించి సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టబద్రుల ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, నేను మునుగోడు లో ప్రచారం చేసి మోసగాళ్ల మాటలకు మోసపోవద్దు అని చెప్పినం అయిన కాంగ్రెస్ కే ఓటు వేశారు. అప్పుడే చెప్పిన కాంగ్రెస్ కావాల్నా, కరెంట్ కావాల్నా? అని..రైతులు, గీత కార్మికులు ఆలోచన చేయాలి.

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 2లక్షల రుణాలు తెచ్చుకోండి, మాఫీ చేస్తా అని చెప్పిండు డిసెంబర్ 9 రుణ మాఫీ ఏమైంది అని ప్రశ్నించారు. ఈ ఉపఎన్నిక తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పోదు, కానీ ప్రశ్నించే గొంతును మండలికి పంపించాలి. కేసీఆర్ ఉన్నపుడు కరెంట్ ఉంది, టైం కు రైతుబంధు ఉందన్నారు. లంక బిందెలు కావాలని దొంగలు తిరుగుతారు , ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా అంటారా అని ప్రశ్నించారు.రాజగోపాల్ రెడ్డి ఎన్ని పార్టీలు మారిండు, రేవంత్ రెడ్డి ,రాజగోపాల్ రెడ్డి ఎలా తిట్టుకున్నారో మీకు తెలుసనని అన్నారు. మునుగోడు లో ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న ఫ్లోరైడ్ ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్ ది అని గుర్తు చేశారు.

వెయ్యేండ్లు గుర్తుండి పోయేలా యాదాద్రి దేవాలయాన్ని నిర్మించింది కేసీఆర్ కాదా అని అన్నారు.10 ఏండ్ల నిజం 6 నెలల అబద్ధం మీ ముందుంది పట్టభద్రులు అలోచన చేయాలని పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ సభా వేదిక సాక్షిగా మహిళలకు రూ.2500 జారీ చేస్తున్నామని పచ్చి అబద్ధాలు చెప్పి పోయిండు. కాంగ్రెస్ పెట్టిన ఉచిత బస్సు తప్పా ఏది చేయలేదని,రేవంత్ రెడ్డి లాంటి ఇంద్ర జాలకున్ని ఎక్కడ చూడలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తానని నిరుద్యోగులను మోసం చేసినరని, రాకేష్ రెడ్డి పేద కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ బిట్స్ పిలాని లో చదివిన వ్యక్తిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల అఫిడవిట్ లో 54 క్రిమినల్ కేసులు ఉన్నాయని మల్లన్న నే ఎన్నికల కమిషనర్ కు ఇచ్చిండు, బి ఆర్ ఎస్ అభ్యర్థి గోల్డ్ మెడలిస్ట్ ఉంటే, కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్ ఉన్నాడన్నారు.ఎవరు కావాలో మీరే తేల్చుకోండని అన్నారు.420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి.కాంగ్రెస్ కు ప్రజలు చేసే మొదటి హెచ్చరిక జారీ చేసే ఎన్నిక ఈ ఉపఎన్నిక అన్నారు. ఈ సమావేశంలో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలినినేటి సందీప్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News