ప్రజల పక్షాన పోరాడేది బీజేపీ

ప్రజల సంక్షేమం కోసం పోరాడేది బీజెపీ మాత్రమేనని మాజీ మంత్రి ,బీజెపీ కేంద్ర నాయకులు ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2024-05-23 12:50 GMT

దిశ ,మిర్యాలగూడ టౌన్ : ప్రజల సంక్షేమం కోసం పోరాడేది బీజెపీ మాత్రమేనని మాజీ మంత్రి ,బీజెపీ కేంద్ర నాయకులు ఈటల రాజేందర్ అన్నారు. పట్టణంలోని కేఎల్ ఎన్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం వరకే పరిమితమైందని ,అమలు చేయడంలో చిత్తశుద్ది లేదని అరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు తప్ప ఏమీ నేరవేర్చలేదని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల హక్కుల కోసం కొట్లాడే పార్టీ బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు.

    ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్‌లను కూడా వారి అవసరాల కోసం రిలీజ్ చేయడం లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల కష్టసుఖాలు తెలుసుకోవడంలో విఫలమైందని అన్నారు. అనంతరం పట్టణం లో పలు ప్రైవేట్ సంస్ధలలో పని చేస్తున్న సిబ్బందిని ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వెంకటేశం ,శానంపూడి సైదిరెడ్డి ,జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ,పట్టణ అధ్యక్షుడు తుమ్మలపల్లి హన్మంత్ రెడ్డి ,నాయకులు సాధినేని శ్రీనివాస్ ,శ్యామ్ ,బంటు సైదులు, గిరి, పురుషోత్తంరెడ్డి ,జానకిరెడ్డి, మట్టయ్య ,రమాదేవి ,సరిత తదితరులు పాల్గొన్నారు. 

Similar News