ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలి

పోలీసులు ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.

Update: 2024-05-11 10:09 GMT

దిశ, కోదాడ : పోలీసులు ఓటర్లతో మర్యాదగా ప్రవర్తించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో తమిళనాడు హోమ్ గార్డ్స్ కు, అరుణాచల్ ప్రదేశ్ సాయుధ సిబ్బందికి, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఎన్నికల రోజు విధులపై దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్స్ అనుమతించవద్దన్నారు. ఎన్నికల సామగ్రికి, ఎన్నికల సిబ్బందికి, ఓటర్లకు భద్రత కల్పించడం పోలీసు విధి అన్నారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు ఆంక్షలు అమలు చేయాలన్నారు. బూత్ ల

    వద్ద బారీకేడ్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలింగ్ బూత్ అధికారి అనుమతి లేకుండా బూత్ లోకి వెళ్లవద్దన్నారు. పోలింగ్ సెంటర్ వద్ద ఏదైనా సమస్య వస్తే రూట్ అధికారులకు, స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అందరి అధికారుల ఫోన్ నంబర్స్ జాబితా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు, కోదాడ డీఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, స్థానిక సీఐ రాము, ఎస్ఐ లు, సెంట్రల్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Similar News