కూలిపోయే స్థితిలో పశు వైద్యశాల.. పట్టించుకోని అధికారులు..

పీఏపల్లి మండల కేంద్రంలో స్థానిక పశువైద్యశాల భవనం పైన మర్రిచెట్టు పెరిగి పెద్దదై ఆసుపత్రి భవనం స్లాబ్ కంటె గోడ సైడ్ భాగం నుండి ఊడలు పాకి కూలే స్థితికి చేరింది.

Update: 2023-06-18 13:32 GMT

దిశ, పీఏపల్లి : పీఏపల్లి మండల కేంద్రంలో స్థానిక పశువైద్యశాల భవనం పైన మర్రిచెట్టు పెరిగి పెద్దదై ఆసుపత్రి భవనం స్లాబ్ కంటె గోడ సైడ్ భాగం నుండి ఊడలు పాకి కూలే స్థితికి చేరింది. కనీసం అధికారులు మర్రి చెట్టు అంత పెద్దగా పెరిగిన కూడా అధికారులు కనీసం అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదని అనే విమర్శలు ఉన్నాయి. పాత ఊర్లో పశువైద్య ఆసుపత్రి భవనం గతంలో కట్టడంతో స్లాబ్ పైన మర్రిచెట్టు విత్తనం పడి ఏపుగా పెరిగి, శిథిలావస్థలోకి చేరుకొని కూలే స్థితికి చేరింది.

అధికారులు ఆసుపత్రికి వచ్చామా వెళ్ళమా తప్ప ఆసుపత్రి అవరణలో చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి అంతా అపరిశుభ్రంగా ఉన్నశుభ్రంగా చేపించడం లేదని అక్కడికి వచ్చిన రైతులు అంటున్నారు. ఆసుపత్రి యందు కనీసం సమాచార బోర్డు పైన అధికారుల ఫోన్ నెంబర్లు లేకపోవడంతో అక్కడికి వచ్చిన వారు ఎవరికి ఫోన్ చేయల్నో తికమక పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమాచార బోర్డు పెట్టి, మర్రి చెట్టును తొలగిస్తారో లేదో.. వేచి చూడాలి మరి.

Tags:    

Similar News