నన్ను చంపమని ఆర్మూర్ జీవన్ రెడ్డి కి సుపారి ఇచ్చారు

నన్ను చంపమని ఆర్మూర్ జీవన్ రెడ్డి కి సుపారి ఇచ్చారని ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు.

Update: 2024-05-25 11:27 GMT

దిశ, నల్లగొండ : నన్ను చంపమని ఆర్మూర్ జీవన్ రెడ్డి కి సుపారి ఇచ్చారని ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న మాట్లాడుతూ ఒక బలహీన వర్గాల బిడ్డ తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్వలేక పోతున్నారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తాను గెలిచినా రాజీనామా చేస్తా అన్నారు. పట్టభద్రులు నాకు అవకాశం ఇస్తే మీ సమస్యల మీద పనిచేస్తా అన్నారు.

    నేను ఎవరినైనా బ్లాక్మయిల్ చేసినట్టు నిరూపించమంటే ఇంత వరకు ముందుకు రాలేదన్నారు. తీన్మార్ మల్లన్నని చంపమని ఆర్మూర్ జీవన్ రెడ్డికి సుపారి ఇచ్చారని ఆరోపించారు. తాను దళిత బిడ్డను పెళ్లి చేసుకున్నానని అవహేళన చేస్తున్నారని పేర్కొన్నారు. తన బిడ్డ మీద తప్పుడు కామెంట్ లు చేస్తున్నారు అని కన్నీటి పర్యంతం అయ్యారు. తీన్మార్ మల్లన్న చనిపోతే బాగుండు అని కేటీఆర్​ అనుకుంటున్నాడని ధ్వజమెత్తారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే పట్టభద్రులకు ఓనర్ని కాదు జీతగాడిని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులు మల్లన్నని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

Similar News