ఓటింగ్ సరళిని పరిశీలించిన మాజీ మంత్రి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ సరళని మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. నియోజకవర్గంలోని మిర్యాలగూడ పట్టణంలోని పోలింగ్ కేంద్రాలతో పాటు, వేములపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.

Update: 2024-05-27 09:02 GMT

దిశ, మిర్యాలగూడ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ సరళని మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. నియోజకవర్గంలోని మిర్యాలగూడ పట్టణంలోని పోలింగ్ కేంద్రాలతో పాటు, వేములపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న విధానాన్ని పార్టీ కార్యకర్తల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు చిట్టిబాబు నాయక్, నల్లమోతు సిద్ధార్థ, చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సైదులు యాదవ్ తదితరులు ఉన్నారు.

Similar News