సైఫ్‌కు వత్తాసు పలికిన వారిపై చర్యలు తీసుకోండి: ఎంపీ కోమటిరెడ్డి

తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Update: 2023-02-27 13:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీనియర్ ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య యత్నం చేసి చికిత్స పొందుతూ మరణించిన మెడికో ప్రీతి మృతిపై వెంకట్ రెడ్డి స్పందించారు. ర్యాగింగ్ భూతానికి బలైన గిరిజన బిడ్డ ప్రీతి మరణం బాధాకరం అన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. ప్రీతి మృతికి బాధ్యుడైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అలాగే సైఫ్ మద్దతుగా నిలిచిన వారి పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సైఫ్ కు వత్తాసు పలికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రీతి ఘటనపై ప్రభుత్వం వేగంగా దర్యాప్తు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలన్నారు.

Tags:    

Similar News