MP Elections 2024 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది.

Update: 2024-05-13 01:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. 17 లోక్ సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాల బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాలకూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఇందులో పురుష ఓటర్లు 1,65,28,366 మంది ఉన్నారు. రాష్ట్రంలో 1,67,01,192 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 2,760 మంది ట్రాన్స్ జెండర్ల ఓటర్లు ఉన్నారు. 13 సమస్యాత్మక స్థానాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. 96 లోక్ సభ స్థానాలకు సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది.


Read More..

MP Elections : ఓటు వేసి భారీ గుడ్ న్యూస్ చెప్పేసిన KA పాల్.. 

Similar News