‘సర్వేలకు కూడా అంతుచిక్కని రిజల్ట్స్’.. లోక్ సభ ఫలితాలపై MP బండి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-24 14:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సర్వేలు బీజేపీవైపే ఉన్నాయని, ఈ సారి సర్వేలకు కూడా అంతుచిక్కని ఫలితాలు వస్తాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ బీజేపీనే గెలుస్తోందని బండి జోస్యం చెప్పారు. కాగా, ఇటీవల తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ నుండి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News