BREAKING: మళ్లీ హైదరాబాద్ వస్తున్నా.. భయపడేది లేదు.. కేసుపై ఎంపీ నవనీత్ కౌర్ సంచలన కామెంట్స్

అమరావతి ఎంపీ, బీజేపీస్టార్ క్యాంపెయినర్, నటి నవనీత్ కౌర్‌పై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-10 13:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతి ఎంపీ, బీజేపీస్టార్ క్యాంపెయినర్, నటి నవనీత్ కౌర్‌పై షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నవనీత్ కౌర్ స్పందించింది. తాను దేనికి భయపడేది లేదని తాజాగా మహారాష్ట్రలో ఆమె మాట్లాడారు. తాను ఓ సైనికుడి కుమార్తెనని చెప్పారు. మరోసారి హైదరాబాద్ వస్తున్నానని ఈ సందర్భంగా సవాల్ చేశారు. కాగా, షాద్‌నగర్ ఎన్నికల ప్రచారంలో నవనీత్ కౌర్ చేసిన వివాదాస్పదం అయ్యాయి. తాజాగా బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే పాకిస్థాన్‌కు వేసినట్లే’నన్న వ్యాఖ్యలపై కేసు నమోదు అయింది.

మరోవైపు హైదరాబాద్ యువమోర్చ సమావేశంలోనూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఎంఐఎం నేతలకు 15 నిమిషాలు అవసరమైతే.. అదే తమకు పోలీసులు పక్కకు తప్పుకుంటే కేవలం 15 సెకన్లు చాలు. తాము తలుచుకుంటే ఎక్కడికిపోతారో తెలియదు’ అంటూ ఓవైసీకి నవనీత్ కౌర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News